ట్రేడ్‌వార్‌ భయం : 400 పాయింట్లు పతనం

6 Dec, 2018 12:32 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీపతనాన్ని నమోదు చేశాయి. వరుసగా మూడు రోజుల నష్టానికి కొనసాగింపుగా నేడు ( డిసెంబరు 6)న  400 పాయింట్లకు పైగా క్షీణించింది  ముఖ్యంగా  మందగిస్తున్న అమెరికా ఆర్థికవ్యవస్థ, చైనీస్‌ టెక్‌ దిగ్గజం హువే డిప్యూటీ చైర్మన్‌ మింగ్‌ అరెస్ట్‌  నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య తిరిగి వాణిజ్య వివాదాలు చెలరేగనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారితీశాయి. దీంతో అమ్మకాల  ఒత్తిడినెలకొంది.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 403 పాయింట్లు పతనమై 35,481 వద్ద, నిఫ్టీ 137 పాయింట్లు కోల్పోయి 10,645 వద్ద ట్రేడవుతోంది.

రియల్టీ, ఐటీ, ఆటో,బ్యాంకింగ్‌  సహా అన్ని రంగాలు నష్టపోతున్నాయి.  ఐబీ హౌసింగ్‌ 5.2 శాతం, మారుతీ, టెక్‌ మహీంద్రా, జీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ, ఐషర్‌, కొటక్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, గ్రాసిమ్‌ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. ఎన్‌సీసీ ఆర్‌కామ్‌, జస్ట్‌డయల్‌, ఓబీసీ, సీజీ పవర్‌, పీసీ జ్యువెలర్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ 5.3-4 శాతం నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు సన్‌ ఫార్మా, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌  స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.

కాగా దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారంలో మరోసారి బలహీన ట్రెండ్‌లోకి జారుకుంది. 2019 ఆర్థిక సంవత్సరంలో 75 స్థాయికి రూపాయి క్షీణిస్తుందని ఎనలిస్టులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు