ఆర్‌బీఐ దెబ్బ, చివరికి నష్టాలే

5 Dec, 2019 15:49 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరికి నష్టాల్లో ముగిసాయి. ఆర్‌బీఐ  ఊహించని విధంగా వడ్డీరేట్లపై యథాతథ నిర్ణయాన్ని ప్రకటించడంతో కీలక సూచీలు లాభ నష్టాల మధ్య తీవ్రంగా ఊగిసలాడాయి. 100పాయింట్లకు పైగా ఎగిసిన మార్కెట్లు చివరికి నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 70  పాయింట్లు క్షీణించి 40779 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 12018 వద్ద ముగిసాయి. తద్వారా 12050 స్థాయిని కోల్పోయింది. నిఫ్టీ బ్యాంకు 400 పాయింట్లు కుప్పకూలింది. అలాగే సెన్సెక్స్‌  డే హై నుంచి 223 పాయింట్లు, నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయింది. 

ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాలు  నష్టపోగా, ఆర్బీఐ దెబ్బతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు కుదేలయ్యాయి. వీటితోపాటు జెఎస్‌ డబ్ల్యు స్టీల్‌, కోల్‌ ఇండియా, భారతి ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, గ్రాసింగ్‌, టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, సిప్లా, హీరోమోటో, గెయల్‌ నష్టపోగా జీ, టీసీఎస్‌,  ఐటీసీ, ఎల్‌ అండ్‌టీ, బ్రిటానియాటాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు