స్వల్ప నష్టాలు: ఫార్మా వీక్‌, బ్యాంక్స్‌ అప్‌

30 May, 2018 16:25 IST|Sakshi

సాక్షి, ముంబై: ఇటలీ, స్పెయిన్‌ రాజకీయ  అనిశ్చితి, గ్లోబల్‌ మార్కెట్ల సంకేతాలు  దేశీయమార్కెట్లను ప్రభావితం  చేశాయి.  దీంతో ట్రేడింగ్‌ ఆరంభంలోనే 200 పాయింట్లుపతనమైన మార్కెట్లు మిడ్‌సెషన్‌  కొనుగోళ్లతో రికవరీ సాధించాయి.  చివరికి సెన్సెక్స్‌ 43 పాయింట్ల స్వల్ప నష్టంతో 34,906 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు తక్కువగా 10,614 వద్ద  ముగిసింది. ఫార్మా  బలహీనంగానూ, బ్యాంక్స్‌  సానుకూలంగానూ ముగిశాయి.  హెచ్‌పీసీఎల్‌  3శాతం నష్టపోగా ,  హిందాల్కో, గ్రాసిమ్‌, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ, మారుతీ, సన్‌ ఫార్మా, దివీస్‌,అరబిందో,  ఐషర్‌, ఇన్ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌ నష్టాల్లో ముగిశాయి. జీఎస్‌కే  ఫార్మా, ఆర్‌కాం,  ఎక్సైడ్‌,  ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, కోల్‌ ఇండియా, యస్‌బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, పవర్‌గ్రిడ్‌, జీ, టెక్‌ మహీంద్రా  లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు