ప్రయివేటు బ్యాంకుల దెబ్బ : నష్టాల్లో ముగిసిన సూచీలు

28 Jun, 2019 16:02 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంనుంచి బలహీనంగా ఉన్న సూచీల్లో మిడ్‌ సెషన్‌ తరువాత అమ్మకాలు జోరందుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 192 పాయింట్లు క్షీణించి 39395 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు పతనమై వద్ద 11788 ముగిసాయి.  వారాంతంలో నిఫ్టీ కీలకమైన 11800  స్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది.  ప్రధానంగా ప్రయివేటుబ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలతో వరుసగా రెండో రోజు కూడా నష్టపోయింది.  హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఇండస్‌, కోటక్‌, యస్‌ బ్యాంకు భారీగా నష్టపోయాయి. అలాగే మెటల్‌, ఆటో షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపించింది.   టాటా మెటార్స్‌, ఐషర్‌ మెటార్స్‌తోపాటు రియలన్స్‌, ఓఎన్‌జీసీ, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు బజాజ్‌ ఫిన్‌ సెర్వ్‌, బజాన్‌ఫైనాన్స్‌  షేర్లు  ఆల్‌ టైం గరిష్టాన్ని నమోదు చేశాయి.  గెయిల్‌, యాక్సిస్‌ బ్యాంకు, అదానీ, మారుతి, బ్రిటానియా హెచ్‌యూఎల్‌ లాభాల్లో ముగిసాయి.  

>
మరిన్ని వార్తలు