వరుసగా మూడోరోజు నష్టాలు : ఐటీ డౌన్‌

3 May, 2019 16:13 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ  స్టాక్‌మార్కెట్లు  స్వల‍్ప నష్టాల్లో ముగిశాయి.  ఆరంభంలో100 పాయింట్లకుపైగా లాభపడినసెన్సెక్స్‌ చివర్లో 18 పాయింట్ల నీరసంతో ముగిసింది. తద్వారా 39వేల స్థాయిని కోల్పోయింది.అలాగే నిఫ్టీ కూడా 13 పాయింట్లునష్టపోయి 11750 స్థాయికి దిగువన ముగిసింది. వరుసగా మూడో రోజుకూడా నష్టాల్లోనే ముగిసింది.  

ఐటీ, ఎఫ్‌ఎంసీజీ,  ఫార్మా నష్టపోయాయి.   రియల్టీ, పీఎస్‌యూ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఆటో రంగాలు లాభపడ్డాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌,ఐటీసీ  భారీగా నష్టపోయాయి.  ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌,యస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు,  భారతి ఎయిర్‌టెల్‌,   భారతి ఇన్‌ఫ్రాటెల్‌, ఎన్‌టీపీసీ,  ఓఎన్‌జీసీ లాభపడ్డాయి. 

మరిన్ని వార్తలు