ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్లు

6 Apr, 2018 09:46 IST|Sakshi

ముంబై : అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌ వార్‌ తీవ్రమౌతున్న నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. చైనాకు వ్యతిరేకంగా 100 బిలియన్‌ డాలర్ల అదనపు టారిఫ్‌లను విధించాలని అమెరికా ట్రేడ్‌ అధికారులను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించడంతో, ట్రేడ్‌ వార్‌ ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. దీంతో అటు ఆసియన్‌ మార్కెట్లు ట్రేడ్‌ వార్‌ ఆందోళనలో ట్రేడవుతున్నాయి. ఈ ప్రభావంతో నిన్నటి ట్రేడింగ్‌లో భారీగా లాభపడిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. 

సెన్సెక్స్‌ 35 పాయింట్ల నష్టంలో 33,561 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంలో 10,310 వద్ద కొనసాగుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఐఓసీ, ఇండియాబుల్స్‌ హౌజింగ్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, గెయిల్‌, యస్‌ బ్యాంకు 1 శాతం వరకు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, వేదాంత, టాటా మోటార్స్‌ ఒత్తిడిలో కొనసాగాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.1 శాతం డౌన్‌ అయింది. 

మరిన్ని వార్తలు