ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు

12 Apr, 2018 09:35 IST|Sakshi

ముంబై : ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీనమైన సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 5 పాయింట్ల నష్టంలో 33,935 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంలో 10,399 వద్ద కొనసాగుతోంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడం, రేపటి నుంచి వెల్లడి కాబోతున్న కార్పొరేట్‌ ఫలితాలు, స్థూల డేటా వంటివి మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఆయిల్‌ రిటైలర్లు, బ్యాంకులు నష్టాల బాట పట్టగా.. ఐటీ స్టాక్స్‌ మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి.

ట్రేడింగ్‌ ప్రారంభంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, టెక్‌ మహింద్రా, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ షేర్లు లాభాలు పడించగా... హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ 3 శాతం వరకు పడిపోయాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్‌ మహింద్రా బ్యాంకు, అల్కెమ్‌ ల్యాబ్స్‌ కూడా ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ బ్యాంకు 0.35 శాతం కిందకి పడిపోయింది.  
 

మరిన్ని వార్తలు