ఊగిసలాట మధ్య వరుసగా నాలుగో రోజు లాభాలు

16 Oct, 2019 15:51 IST|Sakshi

సాక్షి, ముంబై:  తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరికి లాభాల్లో ముగిసాయి.   సెన్సెక్స్‌  93 పాయింట్ల లాభంతో 38599 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు ఎగిసి 11464 వద్ద పటిష్టంగా ముగిసాయి. రోజంతా  లాభనష్టాల మధ్య  కీలక సూచీలు చివరకు వరుసగా నాలుగో రోజు కూడా  లాభాల్లో ముగిసాయి.  రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ , టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాభాలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి. బెంచ్‌మార్క్‌లు అధికంగా  రేజ్‌బౌండ్‌గా మారాయి.  బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా మధ్యాహ్నం ట్రేడింగ్‌లో సూచీలు నష్టపోయాయి.  బ్యాంకింగ్‌ ఆటో నష్టపోగా ఐటి ఇండెక్స్‌  1 శాతం లాభంతో నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మీడియా సూచీలు కూడా 0.7 శాతం పెరిగాయి.

మరిన్ని వార్తలు