చివరికి లాభాలే : 11900 ఎగువకు నిఫ్టీ

2 Jul, 2019 15:56 IST|Sakshi

సాక్షి, ముంబై:   రోజంతా ఒడిదుడుకుల మధ్య  సాగిన స్టాక్‌మార్కెట్లు చివరికి లాభాలతో పటిష్టంగా ముగిశాయి. లాభ నష్టాల మధ్య కన్సాలిడేట్‌ అయిన సూచీలు మిడ్‌ సెషన్‌ తరువాత భారీగా పుంజుకున్నాయి. ట్రేడర్ల కొనుగోళ్ల జోరుతో  వరుసగా రెండవ రోజు కూడా లాభాలతో ముగిశాయి.  సెంచరీకిపైగా నష్టపోయిన సెన్సెక్స్‌ చివర్లో 130  పాయింట్లు   లాభపడటం విశేషం.  అలాగే నిఫ్టీ 45 పాయింట్లు  పుంజుకుని 11900 ( 11910వద్ద) ఎగువన పటిష్టంగా ముగిసింది.  ఫార్మా ఆటో,  బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోగా ,  అయిల్‌ అండ్‌ గ్యాస్‌,  ఎనర్జీ, ఐటీ రంగ షేర్లు లాభపడ్డాయి. 

ప్రధానంగా అదానీ పవర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు,  టొరంటో పవర్‌, ఎస్‌బీఐ లైఫ్‌  ఇన్సూరెన్స్‌ షేర్లు 53  వారాలా గరిష్టాన్ని తాకగా, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌,రుచిసోయా,  52 వారాa కనిష్టానికి  చేరాయి.  ఎస్‌బ్యాంకు, టాటా మోటార్స్‌, సన్‌ఫార్మా, ఇండస్‌ ఇండ్‌  బ్యాంకు,  డా.రెడ్డీస్‌, యాక్సిస్‌ బ్యాంకు, హీరోమెటోకార్స్‌,  కోటక్‌ మహీంద్ర, ఆసియన్‌ పెయింట్స్‌  టాప్‌  లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు యూపిఎల్‌, ఇండియా బుల్స్‌, ఓఎన్‌జీసీ, ఐషర్‌ మోటార్స్‌ ఐవోసీ,  భారతి ఎయిర్‌టెల్‌ , కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, బ్రిటానియా, టెక్‌ మహీంద్ర, విప్రో , టీసీఎస్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు