బ్యాంకుల దన్ను, పటిష్ట ముగింపు

24 Jan, 2020 16:05 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి.  వారం ఆరంభంలో బలహీనంగా ఉన్న సూచీలు వారాంతంలో, వరుసగా రెండో రోజు పాజిటివ్‌గా ముగిసాయి.  తద్వారా వచ్చే శనివారం, ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి  నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న తరుణంలో ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. సెన్సెక్స్‌  227 పాయింట్లు ఎగిసి 41613 వద్ద,  నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 12248 వద్ద 12 200 పాయింట్లకు ఎగువన స్థిరపడింది.  దాదాపు అన్ని  షేర్లు లాభాల్లో ముగిసాయి.  బ్యాంకునిఫ్టీ 238 పాయింట్లు ఎగిసింది. ప్రధానంగా యస్‌బ్యాంకును  కుప్పకూలనివ్వము అన్ని ఎస్‌బీఐ ఛైర్మన్‌ సానుకూల వ్యాఖ్యలతో యస్‌ బ్యాంకు  షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి.  అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టెక్‌ మహీంద్ర, యాక్సిస్‌ బ్యాంకు, కోటక్‌ మహీంద్ర, టైటన్‌, హెచ్‌సీఎల్‌, బ్రిటానియా, కోల్‌ ఇండియా టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. పవర్‌ గ్రిడ్‌,  సిప్లా, ఇండస్‌ ఇండ్‌, టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, సన్‌ఫార్మ, విప్రో రిలయన్స్‌ నష్టపోయాయి. 

మరిన్ని వార్తలు