ఐటీ దన్ను, మార్కెట్లు 250 పాయింట్లు జంప్‌

8 Aug, 2019 14:15 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు పాజిటివ్‌గా  ట్రేడ్‌ అవుతున్నాయి. ఒడిదొడుకుల నుంచి కొలుకుని సెన్సెక్స్‌ 268 పాయింట్లు లాభపడి 36958 వద్ద, నిఫ్టీ 67పాయింట్లు పుంజుకుని 10,920 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీ మార్కెట్ల సానుకూల ధోరణి సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాలు, ప్రపంచ ఆర్థిక మాంద్య ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉందని  ఎనలిస్టులు భావిస్తున్నారు.  

ప్రధానంగా ఐటీ, రియల్టీ, ఆటో లాభపడుతున్నాయి.  క్యూ1 ఫలితాల జోష్‌తో హెచ్‌సీఎల్‌ టెక్‌ 4.5 శాతం జంప్‌చేయగా,  టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ లాభపడుతున్నాయి.  టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎయిర్‌టెల్‌, హిందాల్కో, ఇన్‌ఫ్రాటెల్‌, యస్ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌, ఇన్పోసిస్‌  లాభపడుతున్నాయి. మరోవైపుసిప్లా, టాటా స్టీల్‌, ఐబీ హౌసింగ్‌, ఇండస్‌ఇండ్‌, యాక్సిస్‌, ఓఎన్‌జీసీ, యూపీఎల్‌, ఎల్‌అండ్‌టీ, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు