ఏడునెలల కనిష్టానికి సెన్సెక్స్‌,నిఫ్టీ

26 Oct, 2018 17:02 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో చివరకు అమ్మకాలదే పై చేయి అయ్యింది. లాభానష్టాలమధ్య తీవ్రంగా ఊగిసలాడిన సూచీలు భారీ నష్టాలోతనే ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలసంకేతాలతో సెన్సెక్స్‌ 341 పాయింట్లు పతనమై 33,349కు వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 10,030 వద్ద స్థిరపడింది.  దీంతో  సెన్సెక్స్‌, నిఫ్టీ  ఏడు నెలల  కనిష్టానికి చేరాయి. అలా నవంబరు   సిరీస్‌ నిరాశాజనకంగా స్టార్ట్‌అయింది.  దాదాపు అన్ని రంగాలూ నష్టాల్లోనే. యస్‌బ్యాంక్‌ 9 శాతం పతనంకాగా.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యాక్సిస్, హెచ్‌సీఎల్‌ టెక్‌, గ్రాసిమ్‌, ఇండస్‌ఇండ్‌, టీసీఎస్‌, కొటక్‌ బ్యాంక్‌, జీ, ఐటీసీ 5.5-3 శాతం మధ్య  నష్టాలను మూటగట్టుకున్నాయి.

మరిన్ని వార్తలు