లాభాల్లో మార్కెట్లు, ఐటీసీ టాప్‌

3 Jul, 2017 09:51 IST|Sakshi

ముంబై:  స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.   ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తున్నప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. ముఖ్యంగా జీఎస్‌టీ బూస్ట్‌తో  ఆరంభంలోనే 235 పాయింట్లు ఎగిసి  31,156  వద్ద కొత్త రికార్డును నమోదు చేసింది.  సెన్సెక్స్‌161 పాయింట్ల లాభంతో 31,082వద్ద,   నిఫ్టీ 41 పాయింట్లతో 9562 వద్ద  ఉత్సాహంగా ట్రేడ్‌ అవుతున్నాయి.   ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ దాదాపు 8 శాతం లాభంతో టాప్‌ విన్నర్‌గా ఉంది.   ఆయల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్‌, బ్యాంక్‌నిప్టీ లో  వీకెనెస్‌ కనిపిస్తోంది.  అలాగేజూన్‌  వాహన విక్రయాలు  క్షీణతను నమోదుచేయడంతో ఆటో కంపనీలు బలహీనంగా ఉన్నాయి.  ఐటీ షేర్లు విప్రో, టీసీఎస్‌ నష్టాల్లోనే ఉన్నాయి.  
 
అటు డాలర్‌మారకంలో రూపాయి నష్టాలతో  ప్రారంభమైంది.  0.05 పైసల నష్టంతో  రూ.64.68 వద్ద ఉంది.  పుత్తడికూడా బలహీనంగానే ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో పదిగ్రా. రూ.140 క్షీణించి రూ. 28, 468 వద్ద ఉంది.

 

మరిన్ని వార్తలు