వారాంతంలో ఫైర్‌ : డబుల్‌ సెంచరీ లాభాలు

16 May, 2019 15:02 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా లాభాల్లోకి  ఎగిసాయి. ఆరంభం  నుంచి నామమాత్రపు లాభాలతో అక్కడక‍్కడే కదిలిన సూచీల్లో మిడ్‌ సెషన్‌ తరువాత కొనుగోళ్ల  హోరెత్తింది.   వారాంతం  నేపథ్యంలో ఇన్వెస్టర్ల  షార్ట్‌ కవరింగ్‌ ప్రభావంతో  మార్కెట్లు ఎగిసినట్టు నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ కూడా ఇదే  బాటలో సాగుతోంది.

ప్రధానంగా మీడియా, రియల్టీ, ఐటీ రంగాలు 2-1 శాతం స్థాయిలో లాభపడగా.. ఫార్మా 1.25 శాతం, ప్రభుత్వ బ్యాంక్స్‌ 0.6 శాతం చొప్పున నీరసించాయి. మీడియా కౌంటర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ 5 శాతం జంప్‌చేయగా.. ఐనాక్స్‌, డిష్‌ టీవీ, సన్‌ టీవీ, డీబీ కార్ప్‌ 2-0.6 శాతం మధ్య బలపడ్డాయి. రియల్టీ షేర్లలో ఇండియాబుల్స్‌, ఫీనిక్స్‌, సన్‌టెక్, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 5.5-1 శాతం మధ్య జంప్‌చేశాయి. ఐటీ ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ లాభపడుతున్నాయి. 

మరోవైపు  సన్‌ఫార్మ  టాప్‌ లూజర్‌గా ఉంది.  ఇంకా  ఇండియా బుల్స్‌ ఫైనాన్స్‌, భారతి ఎయిర్‌టెల్‌, కోల్‌ ఇండియా, మహీంద్ర అండ్‌ మహీంద్ర,  ఎల్‌ అండ్‌టీ  నష్టపోతున్నాయి. వీటితోపాటు ఇండిగోలో నెలకొన్న సంక్షోభంతో ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ 8 శాతం,ఎస్‌ బ్యాంకు 5 శాతం  నష్టపోతోంది.
 

మరిన్ని వార్తలు