ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

2 Jul, 2018 09:37 IST|Sakshi

ముంబై : 2018 ఆర్థిక సంవత్సరపు ద్వితీయార్థంలో తొలి రోజే మార్కెట్లు నష్టాలతో ఎంట్రీ ఇచ్చాయి. ట్రేడ్‌ ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉండటంతో ఆసియా నుంచి మిశ్రమ సంకేతాలు వీస్తున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 87 పాయింట్ల నష్టంలో 35,336 వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల నష్టంలో 10,687 వద్ద కొనసాగుతోంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, మారుతీ సుజుకీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఆటో, టైటాన్‌ కంపెనీ, టెక్‌ మహింద్రా, ఇన్ఫోసిస్‌లు లాభాలను ఆర్జించాయి.

మరోవైపు వేదంత, ఐషర్‌ మోటార్స్‌, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, గెయిల్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌ నష్టాలు పాలయ్యాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 20 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ బ్యాంక్‌ 82 పాయింట్లు కిందకి పడిపోయింది. అశోక్‌ లేల్యాండ్‌, గ్రాఫైట్‌ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్‌ 5 శాతం వరకు లాభపడ్డాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ నేడు కూడా కొంత లాభపడింది. 40 పైసలు బలపడి 68.39 వద్ద ట్రేడవుతోంది. 

>
మరిన్ని వార్తలు