సరికొత్త రికార్డులతో ఎంట్రీ

7 Aug, 2018 09:31 IST|Sakshi

ముంబై : రికార్డుల జోరుతో ఉన్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంచి సరికొత్త రికార్డులతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా జంప్‌ చేసింది. నిఫ్టీ సైతం మళ్లీ సాంకేతికంగా తన కీలకమైన మార్కు 11,400 పైకి ఎగిసింది. ప్రస్తుతం 85 పాయింట్ల లాభంలో 37,776 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంలో 11,405 వద్ద ట్రేడవుతున్నాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఎక్కువగా లాభాలు ఆటో, ఐటీ, మెటల్స్‌, ఫార్మాల్లో నెలకొన్నాయి.

నిన్న ర్యాలీ చేపట్టిన బ్యాంక్‌ షేర్లు మాత్రం నేటి ట్రేడింగ్‌లో కిందకి పడిపోతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఇన్ఫోసిస్‌, ఎం అండ్‌ ఎం, హిందాల్కో, గెయిల్‌ టాప్‌ గెయినర్లుగా నిలువగా.. అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎక్కువగా నష్టపోయాయి. స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ, డాలర్‌తో రూపాయి మారకం విలువ మాత్రం స్వల్పంగా పడిపోయింది. 68.88 వద్ద సోమవారం క్లోజైన రూపాయి విలువ నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో 68.91 వద్ద ఎంట్రీ ఇచ్చింది.  

మరిన్ని వార్తలు