ట్రిపుల్‌ సెంచరీ లాభాలతో సెన్సెక్స్‌ ప్రారంభం

13 Jul, 2020 09:28 IST|Sakshi

90పాయింట్ల లాభంతో మొదలైన నిఫ్టీ

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం లాభాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 300 పాయింట్ల లాభంతో 36,896 వద్ద, నిఫ్టీ 90పాయింట్లు పెరిగి 10858 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా బ్యాంకింగ్‌, మెటల్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం లాభంతో 22,631.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, ఆయా కంపెనీ క్యూ1 ఫలితాల ప్రకటన, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి తరలివెళ్లడం మార్కెట్‌ను వర్గాలను ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే నేడు రీటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది.


రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, టాటామోటర్స్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, హిందాల్కో షేర్లు 2శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. గ్రాసీం, బీపీసీఎల్‌, బజాజ్‌-అటో, భారతీఎయిర్‌టెల్‌ షేర్లు 0.10శాతం నుంచి అరశాతం నష్టపోయాయి

మరిన్ని వార్తలు