అమ్మకాల జోరు : ఆరంభ లాభాలు ఆవిరి

25 Feb, 2020 09:45 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలనుంచి తెప్పరిల్లాయి. ఆరంభంలోనే  సెన్సెక్స్‌ 170 పాయింట్లకు పైగా ఎగిసింది.  కానీ వెంటనే అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఊగిసలాట మధ్య కొనసాగుతున్న సూచీల్లో ప్రస్తుతం సెన్సెక్స్‌ 30 పాయింట్ల లాభానికి పరిమితమై 40395 వద్ద, నిఫ్టీ 5 పాయింట్లు లాభంతో11833 వద్ద కొనసాగుతోంది.  దీంతో  సెన్సెక్స్‌40500, నిఫ్టీ 11850 మార్క్‌ దిగువకు చేరాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, మెటల్‌ రంగాలు భారీగా నష్టపోతున్నాయి.  హెచ్‌యూఎల్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, ఆసియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌,భారతి ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌ లాభపడుతుండగా, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మ, టైటన్‌, టెక్‌ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ నష‍్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు