ఫెడ్‌ ప్రకటన: స్వల్ప లాభాలు

21 Sep, 2017 09:37 IST|Sakshi
సాక్షి, ముంబై : ఫెడరల్‌ రిజర్వు మానిటరీ పాలసీ సమావేశనాంతరం ఈక్విటీ బెంచ్‌ మార్కు సూచీలు స్వల్పంగా లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 42.42 పాయింట్ల లాభంలో 32,442.93 వద్ద, నిఫ్టీ 10.95 పాయింట్ల లాభంలో 10,152.10 వద్ద ఆరంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సన్‌ ఫార్మా, లుపిన్‌, హిందాల్కో, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2 శాతం మేర లాభపడ్డాయి. టీసీఎస్‌, బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంకు, అంబుజా సిమెంట్స్‌ ఒత్తిడిలో కొనసాగాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 0.12 శాతం మేర పైకి ఎగిసింది.
 
ఫెడరల్‌ రిజర్వు అర్థరాత్రి ప్రకటించిన మానిటరీ పాలసీ నిర్ణయంతో ఫెడ్‌ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించింది. అమెరికాలో వెలువడుతున్న ఆర్థిక గణాంకాల హెచ్చుతగ్గులు...కీలక వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించడానికి ఒక కారణంగా తెలిసింది. ఫెడ్‌ ప్రకటనాంతరం అటు ఆసియన్‌ మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసల నష్టంలో 64.45 వద్ద కొనసాగుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 156 రూపాయల లాభంలో రూ.29,777 వద్ద ట్రేడవుతున్నాయి. 
 
మరిన్ని వార్తలు