నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

4 May, 2018 09:55 IST|Sakshi
స్టాక్‌ మార్కెట్లు (ఫైల్‌ ఫోటో)

ముంబై : అంతర్జాతీయంగా సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో, దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 20 పాయింట్ల మేర నష్టాల్లో ప్రారంభం కాగ, మరింత నష్టాల్లోకి చేరుకుంది. ప్రస్తుతం 85 పాయింట్ల నష్టంలో 35,018 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 34 పాయింట్ల పడిపోయి 10,645 వద్ద ట్రేడవుతోంది.

ట్రేడింగ్‌ ప్రారంభంలో యాక్సిస్‌ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్‌, కొటక్‌ మహింద్రా బ్యాంకు, టెక్‌ మహింద్రా, ఇన్ఫోసిస్‌లు ఒత్తిడిలో కొనసాగాయి. భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, వేదంతాలు లాభాలు పండించాయి. ఆఫ్రికా కార్యకలాపాల్లో వాటాల విలీనం ద్వారా ఫండ్స్‌ను పొందాలని భారతీ ఎయిర్‌టెల్‌ ప్లాన్‌ చేస్తుండటంతో, ఈ కంపెనీ షేర్లు ర్యాలీ కొనసాగిస్తున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.64 వద్ద కొనసాగుతోంది.
 

మరిన్ని వార్తలు