నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

7 Jul, 2017 09:49 IST|Sakshi
ముంబై : ప్రాఫిట్‌ బుకింగ్‌, బలహీనంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో శుక్రవారం స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 25. 26 పాయింట్ల నష్టంలో 31,344 వద్ద, నిఫ్టీ 10.25 పాయింట్ల నష్టంలో 9,664 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, విప్రో, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఇన్ఫోసిస్‌లు ఒత్తిడిలో కొనసాగాయి. ఫార్మా దిగ్గజం లుపిన్‌ శాతం పైగా లాభపడింది. లుపిన్‌తో పాటు భారతీ ఎయిర్‌టెల్‌, ఐషర్‌ మోటార్స్‌ లాభపడ్డాయి.
 
టాటా టెలిసర్వీసులు, టాటా స్కై, టాటా కామ్‌లు భారతీ ఎయిర్‌టెల్‌లో విలీనమయ్యే ప్రక్రియపై చర్చలు ప్రారంభకావడంతో టాటా టెలీ 5 శాతం మేర లాభపడింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడి 64.72 వద్ద ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో బంగారం ధరలు కూడా 28,105 వద్ద ట్రేడవుతున్నాయి. 
 
మరిన్ని వార్తలు