స్వల్పలాభాల్లో స్టాక్ మార్కెట్లు

20 Apr, 2017 09:55 IST|Sakshi
ముంబై : దేశీయ బెంచ్ మార్కు సూచీలు గురువారం స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలతో మార్కెట్లు పాజిటివ్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ 38.17 పాయింట్ల లాభంలో 29,374 వద్ద, నిఫ్టీ 13.40 పాయింట్ల లాభంలో 9,116 వద్ద ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోయింది. 8 పైసల నష్టంతో 64.66 వద్ద ప్రారంభమైంది. యస్ బ్యాంకు అసెట్ క్వాలిటీ ఫర్ఫార్మెన్స్ మంచిగా లేనట్టు తన ఫలితాల్లో చూపడంతో, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులు 1-2 శాతం పడిపోయాయి.
 
ఫలితాల అనంతరం యస్ బ్యాంకు షేర్లు 3 శాతం నష్టపోయింది. అయితే హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఇన్ఫోసిస్ మార్కెట్లకు మద్దతుగా నిలుస్తున్నాయి. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 231 రూపాయల నష్టంతో 29,283 రూపాయలుగా నమోదవుతోంది. 
>
మరిన్ని వార్తలు