ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు 

22 Nov, 2019 09:33 IST|Sakshi

సాక్షి, ముంబై:   దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.  అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్‌ 25 పాయింట్లు నష్టపోయి 40557  వద్ద,నిఫ్టీ 12 నష్టంతో 11956 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్నిరంగాల షేర్లు స్తబ్దుగానే కొనసాగుతున్నాయి.భారతిఇన్‌ఫ్రాటెల్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, టెక్‌మహీంద్ర, యూపీఎల్‌, హెచ్‌సీఎల్‌టెక్‌ నష్టపోతున్నాయి.  మరోవైపు ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మ, యస్‌బ్యాంకు, వేదాంతా, రిలయన్స్‌, ఓఎన్‌జీసీ,  టాటాస్టీల్‌ లాభపడుతున్నాయి. 

మరోవైపు యుఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు పెరిగి 71.70కు చేరుకుంది. స్వల్ప నష్టంతో 71.77 వద్ద ప్రారంభమైన రూపాయి విదేశీ నిధుల ప్రవాహం, ముడి చమురు ధర సడలింపుల మధ్య భారత రూపాయి శుక్రవారం పుంజుకుంది.  గురువారం 71.76 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు