సరికొత్త శిఖరాలకు చేరిన స్టాక్‌ మార్కెట్‌..

20 Nov, 2019 17:44 IST|Sakshi

ముంబై : ప్రభుత్వ రంగ సంస్ధల్లో పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతం కానుందనే వార్తలతో దలాల్‌ స్ట్రీట్‌లో ఉత్తేజం నెలకొంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో కొనుగోళ్ల జోరుతో స్టాక్‌ మార్కెట్లు బుధవారం సరికొత్త శిఖరాలకు చేరాయి. గ్లోబల్‌ మార్కెట్లు నిరాశపరిచినా పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌పై నిర్ధిష్ట చర్యలు చేపడతారనే అంచనాతో దేశీ మార్కెట్లు సత్తా చాటాయి. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూరిన నిధులతో ద్రవ్య లోటు గాడినపడుతుందనే అంచనా మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 181 పాయింట్ల లాభంతో 40,651 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక 59 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 11,999 పాయింట్ల వద్ద క్లోజయింది. హెల్త్‌కేర్‌, ఎనర్జీ, ఇంధన రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఇక ఎస్‌బీఐ, కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టపోయాయి.

మరిన్ని వార్తలు