ట్రేడ్‌ డీల్‌ అంచనాలు : మార్కెట్ల రీబౌండ్‌

4 Dec, 2019 18:59 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా పుంజుకుని లాభాల్లో ముగిసాయి. అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరవచ్చనే వార్తలతో  కొనుగోళ్లసందడి నెలకొంది. దీంతో మార్కెట్‌ ఒకదశలో 200 పాయింట్లకుపైగా ఎగిసింది. ప్రధానంగా  బ్యాంకింగ్‌, మెటల్‌ రంగ షేర్లలో  కొనుగోళ్ల ధోరణితో సెన్సెక్స్‌ 175 పాయింట్లు పెరిగి 40850 వద్ద , నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 12,037 వద్ద స్థిరపడింది.  ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందనే ఆశలతో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల డిమాండ్‌ నెలకొంది. దీంతో నిఫ్టీ ఇండెక్స్‌ 31,962 వద్ద స్థిరపడింది.  రియల్టీ తప్ప ఐటీ, ఆర్థిక, ఫార్మా, మీడియా, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, టాటామోటర్స్‌  టాప్‌ విన్నర్స్‌గా నిలవగా,  బజాజ్‌ ఫిన్స్‌ సర్వీసెస్‌, ఐఓసీ, కోల్‌ ఇండియా, రిలయన్స్‌ ఇండియా, ఎల్‌ అండ్‌ టీ  టాప్‌ లూజర్స్‌గా మిగిలాయి. 

మరిన్ని వార్తలు