అనూహ్యంగా లాభాల్లోకి : బ్యాంక్స్‌, ఆటో జోరు  

9 Apr, 2019 14:44 IST|Sakshi

సాక్షి, ముంబై :దేశీయ స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా లాభాల్లోకి మళ్లాయి. తీవ్రహెచ్చు తగ్గులమధ్య కన్సాలిడేట్‌ అవుతూ కొనుగోళ్లతో రీబౌండ్‌ అయ్యింది. సెన్సెక్స్‌ 120 పాయింట్లకు పైగా పుంజుకోగా, నిఫ్టీ 40పాయింట్లు ఎగిసింది.  నిఫ్టీ 11650కిపైన కొనసాగుతోంది.  ప్రభుత్వ బ్యాంకింగ్‌, ఆటో షేర్లలో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకోవడంతో సూచీలు లాభాలతో  కళకళలాడుతున్నాయి.  హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ తోపాటు, కెనరా,  పీఎన్‌బీ,కోటక్‌ మహీంద్ర,   ఫెడరల్‌ బ్యాంకు  ఇలా అన్ని   బ్యాంకు షేర్ల లాభాలతో  బ్యాంక్‌ నిఫ్టీ 30వేల స్థాయికి చేరింది. మారుతి, టాటా మోటార్స్‌  బజాజ్‌ ఆటో, విప్రో కోల్‌ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌ తదితర షేర్లు లాభపడుతున్నాయి.  అటు గ్లోబల్‌మార్కెట్లలో కూడా  ఓలటైల్‌ ధోరణి నెలకొంది. 

మరిన్ని వార్తలు