కొత్త గరిష్టాలు : లాభనష్టాల ఊగిసలాట

21 Aug, 2018 10:21 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. కీలక సూచీలు రెండూ ఆల్‌టైంకనిష్టాన్నితాకిన అనంతరం లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణతో​  వరుసగా మూడో రోజుకూడా దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త గరిష్టాలను నమోదుచేశాయి. అనంతరం ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సెన్సెక్స్‌ 80పాయింట్లకు పైగా, నిఫ్టీ 25 పాయింట్లు బలపడి సెన్సెక్స్‌ 38,300 పాయింట్లు నిఫ్టీ 11,570 ను తాకాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో  బలహీనపడ్డాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 5 పాయింట్ల  నిష్టీ 4 పాయింట్ల స్వల్ప లాభంతో కొనసాగుతున్నాయి.

ఐటీ, ఆటో రంగాలు లాభాల్లోనూ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ  బలహీనంగా  కొనసాగుతున్నాయి. బజాజ్‌ ఆటో, ఐటీసీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫ్రాటెల్‌, హీరో మోటో, ఐషర్‌, గెయిల్‌, కోల్‌ ఇండియా, అదానీ పోర్ట్స్‌  లాభపడుతుండగా ఐసీఐసీఐ, వేదాంతా, ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండస్‌ఇండ్, కొటక్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, హెచ్‌యూఎల్‌  నష్టపోతున్నాయి.
 

మరిన్ని వార్తలు