బడ్జెట్‌పై భరోసా : కొనుగోళ్ల జోరు

29 Jan, 2020 16:12 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు రెండురోజుల నష్టాలకు చెక్‌ చెప్పాయి.ముఖ‍్యంగా కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ అంచనాలతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు జోరందుకున్నాయి. దీంతో ఆరంభంనుంచి లాభాల్లో కొనసాగిన సూచీలు చివరివరకూ అదే జోరును కంటిన్యూ చేశాయి.  ఒక దశలో 350పాయింట్లు ఎగిసిన  సెన్సెక్స్‌ చివరికి 232 పాయింట్ల లాభంతో 41198 వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు ఎగిసి 12129 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటిసి, ఇన్ఫోసిస్, ఆర్‌ఐఎల్‌లలో లాభాల వల్ల సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం  భారీ లాభాల్లో ముగిసాయి. దాదాపు అన్ని  రంగాల  షేర్లు లాభాల్లో ముగిసాయి. యస్‌బ్యాంకు, జీ, వేదాంతా, గెయిల్‌, ఓఎన్‌జీసీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.  టాటామోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఫిన్‌ సర్వ్‌ , నెస్లే , అదానీ పోర్ట్స్‌,  టాప్‌విన్నర్స్‌గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు