వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలు

15 Oct, 2019 15:49 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో  సెషన్‌లోకూడా లాభాలతోముగిసాయి.  ఆరంభంనుంచి లాభాల మధ్ యసాగిన కీలక  సూచీ సెన్సెక్స్‌ ఒకదశలో 400 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరి గంటలో ఇన్వెస్టర్లు లాభాల  స్వీకరణకు దిగడంతో సెన్సెక్స్‌  292 పాయింట్ల లాభంతో 38506 వద్ద, నిఫ్టీ 87 పాయింట్లుఎ గిసి 11428 వద్ద ముగిసింది.  ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్‌ షేర్ల లాభాలు  దలాల్‌ స్ట్రీట్‌కు ఊతమిచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మహీంద్ర బ్యాంకు హిందుస్తాన్‌ యూనీలీవర్‌, ఐటీసీ, వేదాంతా, హీరో మోటో, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, మారుతి,  బజాజ్‌ ఆటో లాభపడ్డాయి.  మరోవైపు భారతి ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌,  జెఎస్‌డబ్ల్యూ,  భారతి ఇన్ ఫ్రా, టాటా మోటార్స్‌, యూపిఎల్‌ నష్టపోయాయి.

మరిన్ని వార్తలు