సెన్సెక్స్ మరో ధమాకా!

8 Sep, 2014 17:40 IST|Sakshi
సెన్సెక్స్ మరో ధమాకా!
ముంబై: స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు పరుగులు పెడుతున్నాయి. సోమవారం నాటి ట్రేడింగ్ లో సెప్టెంబర్ 3 తేదిన నమోదు చేసిన జీవితకాలపు గరిష్టస్థాయి 27225 పాయింట్లని అధిగమించింది. తాజాగా సెన్సెక్స్ 27354 పాయింట్లను తాకి  నూతన గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. ఐటీ, మెటల్, హెల్త్ కేర్, ఆటో, కాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్ రంగాల కంపెనీ షేర్లు సెన్సెక్స్ కు పెరుగుదలకు మద్దతిచ్చాయి. 
 
ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 27354 గరిష్ట స్థాయిని, 27026 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 8173 పాయింట్ల రికార్డుస్థాయి వద్ద ముగిసింది. 
 
ఏషియన్ పెయింట్స్ అత్యధికంగా 4.47 శాతం లాభపడగా, హిండాల్కో, అంబుజా సిమెంట్స్, ఓఎన్ జీసీ, గ్రాసీం రెండు శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఎన్ టీపీసీ, ఎన్ఎమ్ డీసీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎం అండ్ ఎం, టాటా పవర్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. 
>
మరిన్ని వార్తలు