రికార్డులకు స్వల్ప విరామం: ఫ్లాట్‌గా మార్కెట్లు

29 Aug, 2018 10:07 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు రికార్డు స్థాయి లాభాలకు స్వల్ప విరామం ప్రకటించినట్టుగా కనిపిస్తున్నాయి. వరుసగా రెండు రోజులపాటు రికార్డు మోత మోగించిన  కీలక సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 31 పాయింట్ల లాభంతో 38,927వద్ద నిఫ్టీ 4 పాయింట్ల లాభపడి 11,742 వద్ద ట్రేడవుతోంది.  మరోవైపు గురువారం(30న) ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో  ఇన్వెస్టర్ల అప్రమత్తత  కొనసాగనుందని నిపుణులు భావిస్తున్నారు. పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌  స్వల్ప లాభాలతో ఉండగా, ఐటీ నష్టపోతోంది. వేదాంతా, గెయిల్‌, అదానీ పోర్ట్స్‌, ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, సన్‌ ఫార్మా, యూపీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లాభాల్లో కొనసాగుతున్నాయి.  అటు కోల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా, ఐబీ హౌసింగ్‌, లుపిన్‌, ఇన్ఫ్రాటెల్‌, సిప్లా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌, టైటన్‌ నష్టపోతున్నాయి.

 

మరిన్ని వార్తలు