నష్టాల బాటలో స్టాక్‌ మార్కెట్లు

6 Jun, 2019 09:56 IST|Sakshi

ముంబై : ఆర్‌బీఐ విధాన భేటీకి ముందు స్టాక్‌ మార్కెట్లలో అప్రమత్తత నెలకొంది. వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ధోరణితో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పలు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 100 పాయింట్ల నష్టంతో 40,000 పాయింట్ల దిగువన, నిఫ్టీ 48 పాయింట్ల నష్టంలో 12వేల పాయింట్ల దిగువన ట్రేడవుతోంది. ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతి ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తదితర షేర్లు నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు