లాభాల్లోకి సూచీలు

18 Jun, 2020 10:05 IST|Sakshi

 నష్టాలనుంచి లాభాల్లోకి సూచీలు

9900 ఎగువకు నిఫ్టీ

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, కరోనా మళ్లీ విజృంభిస్తోందన వార్తలు, భారత్- చైనా ఉద్రిక్తతల నడుమ పెట్టుబడిదారులు సెంటిమెంట్ ప్రభావిత మవుతోంది. కానీ ఆరంభ నష్టాలనుంచి కోలుకున్న సూచీలు లాభాల్లోకి  మళ్లాయి. సెన్సెక్స్   53 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 9904 వద్ద కొనసాగుతోంది.  అయితే లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది.   

భారత-చైనా సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు మన మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నాయని సమీత్ చవాన్ (చీఫ్ అనలిస్ట్-టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ ఏంజెల్ బ్రోకింగ్) తెలిపారు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌,ఆటో రంగ షేర్లలో నష్ట పోతుండగా, ఐటీ, ఫార్మ, ఎఫ్‌ఎంసీజీ సెక్టార్ స్వల్పలాభాల్లో ఉంది. కాగా బజాజ్ కన్స్యూమర్ కేర్, ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, సిటీ యూనియన్ బ్యాంక్, కేర్ రేటింగ్స్ థామస్ కుక్ నేడు తమ ఫలితాలను ప్రకటించనున్నాయి.  మరోవైపు ఫిచ్ రేటింగ్ ఇండియాకు నెగిటివ్ ఔట్ లుక్  ఇవ్వడంతో  ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగనుంది. 
చదవండి : 12 వ రోజూ పెట్రో సెగ

మరిన్ని వార్తలు