ప్యాకేజీపైనే దృష్టి : ఆరంభ లాభాలు ఆవిరి

13 May, 2020 15:49 IST|Sakshi

లాభాల ముగింపు

32వేల ఎగువన సెన్సెక్స్‌

9400 దిగువకు నిఫ్టీ

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు  భారీ లాభాలనుంచి  వెనక్కి తగ్గాయి.  భారీ ప్యాకేజీ ఆశలతో ఆరంభంలో 1400 పాయింట్లు ఎగిసిన మార్కెట్‌ వెంటనే  1000 పాయింట్ల లాభానికి పరిమితమైంది. చివరికి వరుస రెండు రోజుల నష్టాలకు చెక్‌ చెప్పి  637 పాయింట్లు  లాభంతో సెన్సెక్స్‌ 32008 వద్ద, నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో  9383 వద్ద స్థిరపడింది. సెన్సెక్స​ 32 వేల స్థాయికి ఎగువన, నిఫ్టీ 9400 దిగువన ముగిసాయి. ఆటో,  బ్యాంకింగ్‌ సహా అన్ని రంగాలు లాభాల్లోనే  ముగిసాయి. నిఫ్టీకి 9400 వద్ద గట్టి రెసిస్టెన్స్‌ వుందని మార్కెట్‌   పండితులు   సూచిస్తున్నారు.  (మెగా ప్యాకేజీ ‌ : భారీ లాభాలు)

యాక్సిస్ బ్యాంక్, ఎల్‌ అండ్‌టీ, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా  అండ్‌ మహీంద్రా,  బజాజ్ ఫైనాన్స్, వేదాంతా, ఐసీఐసీఐ బ్యాంకు భారీగా లాభపడ్డాయి.  అటే డాలరు మారకంలో రూపీ కూడా పాజిటివ్‌గా ముగిసింది.అయితే ఆరంభంలో 75.27 స్థాయికి ఎగిసినా, అంతర్జాతీప్రతికూల సంకేతాలతో చివరికి 75.46 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు