మార్కెట్ల రీబౌండ్‌, ఆటో జూమ్‌

16 Aug, 2019 14:23 IST|Sakshi

సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్లు  అనూహ్యంగా రీబౌండ్‌ అయ్యాయి. భారీ నష్టాల నుంచి కోలుకుని 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ​ అవుతున్నాయి. వారాంతంలో  షార్ట్‌ కవరింగ్‌, ఆటో షేర్లలో కొనుగోళ్ల కారణంగా  మిడ్‌ సెషన్‌  తరువాత కనిష్టంనుంచి  దాదాపు 400 పాయింట్లు ఎగిసాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 122 పాయింట్లు లాభపడి 37433 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు పుంజకుని 11065 వద్ద కొనసాగుతున్నాయి.   ప్రధానంగా  బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో  పుంజుకోగా, ఐటీ, ఫార్మ నష్టపోతున్నాయి. యస్‌బ్యాంకు, మారుతి సుజుకి, ఇండస్‌ ఇండ్‌, ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఎం అండ్‌ ఎం టాప​ విన్నర్స్‌గా కొనసాగుతున్నాయి.  మరోవైపు ఇండియా బుల్స్‌  హౌసింగ్‌, టీసీఎస్‌, డా.రెడ్డీస్‌, సన్‌ ఫార్మ, టాటా స్టీల్‌, వేదాంతా, హిందాల్కో, టెక్‌ మహీంద్ర నష్టపోతున్నాయి. 
 

మరిన్ని వార్తలు