ఫ్లాట్‌గా సూచీలు, టెలికం షేర్లు లాభాల్లో

2 Dec, 2019 13:54 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మారాయి. ఆరంభ లాభాలను కోల్పోయిన కీలక సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి.  ఆ తరువాత మిడ్‌ సెషన్‌నుంచి స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 8 పాయింట్లు నష్టపోయి 40788 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 12046 వద్ద కొనసాగుతున్నాయి. టారిఫ్‌ రేట్లు పెరగనున్నాయన్న వార్తలతో టెలికాం షేర్లు లాభ పడుతున్నాయి. భారతి ఎయిర్‌టెల్ 6.5 శాతం,  వొడాఫోన్ ఐడియా 17 శాతం,  జియో ఇన్ఫోకామ్ 2.4 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతోపాటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టీసీఎస్, గ్రాసిమ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, భారతి ఇన్‌ఫ్రాటెల్  లాభపడుతుండగా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, యస్‌ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఒఎన్‌జీసీ, జీ నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు