ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు

29 Jun, 2017 16:56 IST|Sakshi

ముంబై: ఒడిదుడుకుల మధ్య కొనసాగిన  దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా  ముగిశాయి.  సెన్సెక్స్‌23 లాభపడి 30, 857 వద్ద,  నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 9504 వద్ద ముగిశాయి.  పిఎస్‌యూ బ్యాంకింగ్, ఫైనాన్షియల్  షేర్లు  అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.  కాగా మెటల్, ఐటీ, రియాల్టీ లాభపడింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.37 శాతం, స్మాల్ క్యాప్ సూచీలు 0.85 శాతం  పుంజుకున్నాయి.   జూన్‌ నెల ఎఫ్‌ అండ్‌ వో సిరీస్‌ నేటి ముగిసింది.

వేదాంత, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, బిపిసిఎల్, టాటా స్టీల్ లాభాలు  లాభపడగా,  కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.6 శాతం,  ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, సీఎం రెడ్డి ల్యాబ్స్  నష్టపోయాయి.

అటు డాలర్‌ మారకంలో  రూపాయి 0.01 పైసలు  నష్టపోయి 64. 56 వద్ద ఉంది. ఎంసీఎక్స్‌  బంగారం పది గ్రా. రూ.24 క్షీణించి రూ. 28,543 వద్ద ఉంది.
 

మరిన్ని వార్తలు