ఆఖర్లో అమ్మకాలు...

4 Sep, 2018 01:29 IST|Sakshi

ముంబై: రూపాయి పతనం, ముడిచమురు రేట్ల పెరుగుదల, అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాల పరిస్థితుల నడుమ ఆశావహ క్యూ1 జీడీపీ గణాంకాలు మార్కెట్లను మెప్పించలేకపోయాయి. ఫలితంగా ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, విద్యుత్, బ్యాంకింగ్‌ తదితర రంగాల స్టాక్స్‌లో ఆఖర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీ సూచీలు సోమవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. దీంతో వరుసగా నాలుగో రోజూ నష్టాలే నమోదు చేసినట్లయింది. సోమవారం సెన్సెక్స్‌ 333 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్ల మేర క్షీణించాయి. నిఫ్టీ కీలకమైన 11,600 దిగువన క్లోజయ్యింది. ఆగస్టు 2 తర్వాత ఒకే రోజున దేశీ సూచీలు ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి.

అప్పట్లో ఒకే రోజున బీఎస్‌ఈ 356 పాయింట్లు, నిఫ్టీ 101.5 పాయింట్లు పతనమయ్యాయి. శుక్రవారం వెల్లడైన జీడీపీ గణాంకాలు ఆశావహంగా ఉండటం, రూపాయి రికవరీతో .. సోమవారం ప్రారంభ సెషన్లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 289 పాయింట్లు ఎగిసి 38,934 పాయింట్ల స్థాయిని తాకింది. కానీ ఆగస్టులో తయారీ కార్యకలాపాలు మందగించాయంటూ ఆ తర్వాత వచ్చిన గణాంకాలు, రూపాయి పతనం తదితర అంశాలతో అమ్మకాలు వెల్లువెత్తిన దరిమిలా సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్‌ 0.86 శాతం నష్టంతో 33,312 పాయింట్లు వద్ద (ఇది వారం రోజుల కనిష్టం), నిఫ్టీ 0.84 శాతం నష్టపోయి 11,582 వద్ద క్లోజయ్యాయి.  

హెచ్‌యూఎల్‌ 4 శాతం డౌన్‌..
సెన్సెక్స్‌లో హిందుస్తాన్‌ యూనిలీవర్‌ అత్యధికంగా 4.58 శాతం నష్టపోగా, పవర్‌గ్రిడ్‌ 2.92 శాతం క్షీణించింది.

కారణాలివీ..
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే కొత్తగా లైఫ్‌టైమ్‌ కనిష్ట స్థాయి 71.21కి పతనమైంది. తయారీ రంగ కార్యకలాపాలు వరుసగా రెండో నెల ఆగస్టులో కూడా మందగించడం కూడా దీనికి తోడైంది. చైనా దిగుమతులపై కొత్తగా మరిన్ని టారిఫ్‌లు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు  హెచ్చరించిన దరిమిలా.. వాణిజ్య యుధ్ధ పరిణామాలను అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.

అటు ఇరాన్‌పై ఆంక్షలతో ముడి చమురు సరఫరా దెబ్బతినొచ్చన్న భయాలతో క్రూడాయిల్‌ రేట్లు పెరుగుతున్నాయి. ఇవి సూచీల పతనానికి కారణాలు. ‘జీడీపీ గణాంకాల ఊతంతో మార్కెట్లు సానుకూలంగానే ప్రారంభమయ్యాయి. అయితే, వాణిజ్య యుద్ధ భయాలు, చమురు రేట్ల పెరుగుదల తదితర అంశాల మూలంగా ఆ తర్వాత లాభాల స్వీకరణ జరిగింది. కరెన్సీల క్షీణతా సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విశ్లేషించింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లిప్‌కార్ట్‌ : అతిపెద్ద బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌

కొత్త కొత్తగా వాట్సాప్‌ నోటిఫికేషన్స్‌

నిర్మాణ వ్యయం తక్కువే!

వావ్‌.. త్రీడీ వాల్‌

జీఎంఆర్‌కు గ్రీస్‌ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రాక్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వివాదాల్లో చెన్నై చిన్నది

బిజీ బీజీ!

మాట ఒకటై.. మనసులు ఒకటై...

ఐరన్‌ లేడీ!

నవాబ్‌ వస్తున్నాడు

హాలీవుడ్‌ ఎంట్రీ!