లాభాల స్వీకరణ:  ఫ్లాట్‌గా  సూచీలు

8 Nov, 2019 14:19 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్ల  గరిష్ట స్థాయిల న ఉంచి వెనక్కి తగ్గాయి. మూడు రోజుల ర్యాలీకి బ్రేక్‌ వేస్తూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణవైపు మొగ్గు చూపారు.  దీంతో  ప్రస్తుతం సెన్సెక్స్‌ 89 పాయింట్లు క్షీణించి 40,565 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు నీరసించి 11,980 వద్ద ట్రేడవుతోంది.

ప్రధానంగా రియల్టీ,  ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మీడియా  స్వల్పంగా లాభపడుతుండగా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా  బలహీనంగా ఉంది. యస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్, ఎంఅండ్ఎం, జీ, కోల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా, బ్రిటానియా, హీరో మోటో, హెచ్‌సీఎల్‌ టెక్‌  లాభాల్లోనూ, ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌, సన్‌ ఫార్మా, సిప్లా, టాటాస్టీల్‌, ఎయిర్‌టెల్, గెయిల్, ఆర్‌ఐఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్, వేదాంతా నష్టాల్లోనూ  కొనసాగుతున్నాయి.మరోవైపు వాణిజ్య వివాద పరిష్కారానికి ఒప్పందం కుదరనున్న సంకేతాల కారణంగా గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టం వద్ద ముగిశాయి. 

మరిన్ని వార్తలు