ఫార్మా స్టాక్స్ ర్యాలీ: లాభాల్లో మార్కెట్లు

30 May, 2017 15:58 IST|Sakshi
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సరికొత్త రికార్డు స్థాయిల్లో ముగిశాయి. సెన్సెక్స్ 50.12 పాయింట్ల లాభంలో 31,159.40వద్ద, నిఫ్టీ 19.65 పాయింట్ల లాభంలో 9624.55గా క్లోజ్ అయ్యాయి. వరుసగా తొమ్మిది రోజుల పాటు నష్టాల్లో కొనసాగిన ఫార్మా స్టాక్స్ లో కొనుగోలు మద్దతు లభించింది. దీంతో అరబిందో ఫార్మా స్టాక్ భారీగా 13 శాతం మేర దూసుకెళ్లింది. హెల్త్ కేర్ ఇండెక్స్ కూడా 2 శాతం పైననే లాభపడింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు కనీసం 2 శాతం మేర లాభపడ్డాయి.
 
నిన్నటి మార్కెట్లో ర్యాలీ సాగించిన ఎఫ్ఎంసీజీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకుంది. నేటి ట్రేడింగ్ లో అదానీ పోర్ట్స్, అరబిందో ఫార్మా, ఎన్టీపీసీ టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. బీహెచ్ఈఎల్, ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బీపీసీఎల్ ఎక్కువగా నష్టపోయాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 18 పైసలు బలహీనపడి 64.63 వద్ద నమోదైంది. బంగారం ధరలు ఎంసీఎక్స్ మార్కెట్లో 40 రూపాయల నష్టంలో 28,860గా రికార్డయ్యాయి.    
 
మరిన్ని వార్తలు