ప్యాకేజీ ఆశలు : సెన్సెక్స్ 100 పాయింట్లు జంప్

27 Mar, 2020 09:42 IST|Sakshi

 సాక్షి ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు  భారీ లాభాలతో ప్రారంభమైనాయి. రిలీఫ్ ప్యాకేజీల   బూస్ట్ తో అమెరికా మార్కెట్లు  పుంజుకున్నాయి. దీనికి తోడు దేశీయంగా  కూడా కేంద్రం  ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో వరుసగా మూడవ సెషన్ లో కూడా  కీలక సూచీల లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.  ఆరంభంలోనే సెన్సెక్స్ 31వేలు,   నిఫ్టీ 9వేల స్థాయిని అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 1104 పాయింట్లు ఎగిసి 31070 వద్ద, నిఫ్టీ 371పాయింట్ల లాభంతో 9007వద్ద కొనసాగుతున్నాయి. (ఆర్బీఐ మరో రిలీఫ్ ప్యాకేజీ?)

ఫార్మా, బ్యాంకింగ్ సహా అన్ని రంగాలు లాభపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్‌బీఐ ఆర్థిక ప్యాకేజీ పై అంచనాలతో సెంటిమెంటు బలంగా వుంది. అయితే ఆర్‌బీఐ ప్రకటనఆధారంగా మార్కెట్ల  కదలికలు ఉండనున్నాయనీ, అప్రమత్తత అవసరమని  మార్కెట్ ఎనలిస్టులు సూచిస్తున్నారు.  అటు డాలరు మారకంలో  రూపాయి పాజిటివ్ గా  ప్రారంభమైంది. గురువారం నాటి ముగింపు75.15 తో పోలిస్తే   శుక్రవారం 74.69 వద్ద  ట్రేడ్ అవుతోంది. 
 

మరిన్ని వార్తలు