కుప్పకూలిన స్టాక్ మార్కెట్

24 Jun, 2016 10:16 IST|Sakshi
కుప్పకూలిన స్టాక్ మార్కెట్

ముంబై: 'బ్రెగ్జిట్' ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ భారీగా పతనమవుతోంది. అన్ని సూచీలు నిలువునా కుప్పకూలాయి. ఈ ఉదయం మార్కెట్ ప్రీ-ఓపెన్ సెషన్ లో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 634 పాయింట్లు పడిపోయింది. ఓపెన్ సెషన్ లో 940 పాయింట్ల వరకు పతనమైంది. తర్వాత 10.5 గంటల సమయంలో వెయ్యి పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం 1000-900 పాయింట్ల మధ్య ఊగిసలాడుతోంది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 280 పాయింట్లు పైగా నష్టపోయింది. నిఫ్టీ 8 వేల పాయింట్ల దిగువన ట్రేడ్ అవుతోంది.

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న వార్తలతో స్టాక్ మార్కెట్ తీవ్రంగా స్పందించింది. 'బ్రెగ్జిట్' ప్రభావంతో స్టాక్ మార్కెట్ లో తీవ్ర ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అన్ని సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 89 పైసలు పడిపోయింది. డాలర్ తో రూపాయి విలువ 68.17గా ఉంది. జపాన్ స్టాక్ మార్కెట్ కూడా 8 శాతం పతనమైంది. దీంతో 10 నిమిషాల పాటు జపాన్ స్టాక్ మార్కెట్ ను నిలిపివేశారు.

మరిన్ని వార్తలు