ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

8 Jan, 2019 09:33 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల ప్రభావంతో కీలక సూచీలు నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్‌ 75 పాయింట్లు కోల్పోయి 35,775 వద్ద, నిఫ్టీ 10,739 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ, ఫార్మా తప్ప అన్ని రంగాలు బలహీనంగా ఉన్నాయి. టాటా మోటార్స్‌, సన్‌ఫార్మ, ఐషర్‌ మోటర్స్‌, డా.రెడ్డీస్‌, వేదాంత లాభాల్లో ఉన్నాయి. మరోవైపు ఎం అండ్‌ ఎం, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌పీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంకు, బీపీసీఎఎల్‌తో పాటు గృహఫైనాన్స్‌బంధన్‌ బ్యాంకు మెర్జర్‌తో హెచ్‌డీఎఫ్‌సీ, బంధన్‌, గృహఫైనాన్స్‌ నష్టపోతున్నాయి.

అటు కరెన్సీ బజార్‌లో దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డాలరు మారకంలో 36పైసలు కోల్పోయి 70 స్థాయికి చేరింది.

మరిన్ని వార్తలు