9,900కి పైన నిఫ్టీ

5 Oct, 2017 10:05 IST|Sakshi

ముంబై :  ప్రపంచ సంకేతాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో పాటు, ఆర్‌బీఐ మానిటరీ పాలసీ నిర్ణయం మెజార్టీ విశ్లేషకులు అంచనావేసిన విధంగా రావడంతో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 72.65 పాయింట్లు పెరిగి 31,744కు చేరగా.. నిఫ్టీ 21 పాయింట్లు బలపడి 9,936 వద్ద ట్రేడవుతోంది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,900 మార్కు ఎగువనే నిఫ్టీ ట్రేడవుతోంది. ఎన్‌ఎస్ఈలో రియల్టీ ఇండెక్స్‌ 1 శాతం పుంజుకోగా.. ఫార్మా 0.6 శాతం లాభపడింది.

ఎంఅండ్‌ఎం, రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌లు ట్రేడింగ్‌ ప్రారంభంలో టాప్‌ గెయినర్లుగా నిలువగా.. ఎన్‌టీపీసీ, విప్రో, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌ ఎక్కువగా నష్టపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 40 పైసలు బలపడి 65.10 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 95 రూపాయల నష్టంలో 29,260 రూపాయలుగా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు