లాభాల ఆరంభం: ఐటీ వీక్‌

26 Nov, 2018 09:55 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  ఊత్సాహంగా మొదలయ్యాయి. చమురు ధరల పతనంతో అమెరికా మార్కెట్లు బలహీనపడినప్పటికీ ఆసియాలో మార్కెట్లు మాత్రం లాభాలతో ట్రేడవుతున్నాయి. అటు రూపాయి బలం, చమురు పతనం కారణంగా కీలక సూచీల్లో ఉత్సాహం నెలకొంది.  సెన్సెక్స్‌ 35వేలకు, నిఫ్టీ 10600 ఎగువకు  చేరాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే  సెంచరీ లాభాలను సాధించిన సెన్సెక్స్‌  అనంతరం మరో 30 పాయింట్లకుపైగా ఎగిసింది.  అనంతరం  55 పాయింట్లు పెరిగి 35035కు వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు పరిమితమై 10, 539 వద్ద ట్రేడవుతోంది.

ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్ నిఫ్టీ, ఆటో  లాభాల్లో ఉండగా రూపాయి బలపడటంతో ఐటీ నష్టపోతోంది. మెటల్‌ రంగషేర్లుకూడాబలహీనంగా ఉన్నాయి. ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, యాక్సిస్‌, ఎయిర్‌టెల్‌, ఐవోసీ, బజాజ్‌ ఫిన్‌, పవర్‌గ్రిడ్‌, ఏషయిన్‌ పెయింట్స్‌, ఆర్‌ఐఎల్‌ లాభాల్లోనూ,  యస్‌ బ్యాంక్‌ 4.25 శాతం పతనంకాగా.. అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, వేదాంతా, విప్రో, ఓఎన్‌జీసీ, కొటక్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, సన్‌ ఫార్మా  నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
 

మరిన్ని వార్తలు