ఒడిదుడుకుల్లో స్టాక్‌మార్కెట్లు

31 Jan, 2018 09:45 IST|Sakshi
ఒడిదుడుకులుగా సాగుతున్న స్టాక్‌మార్కెట్లు(ఫైల్‌)

ముంబై : అంతర్జాతీయంగా వస్తున్న సంకేతాలు బలహీనంగా ఉండటంతో, దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌, నిఫ్టీ లాభనష్టాల ఊగిసలాటలో నడుస్తున్నాయి. సెన్సెక్స్‌ స్వల్పంగా 5 పాయింట్ల నష్టంలో 36,028 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల లాభంలో 11,052 వద్ద ట్రేడవుతున్నాయి. నేటి ట్రేడింగ్‌లో టాప్‌ లూజర్లుగా హిందూస్తాన్‌ యూనిలివర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌, ఇండియాబుల్స్‌ హౌజింగ్‌ ఉండగా.. టాప్‌ గెయినర్లుగా భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఇండియన్‌ ఆయిల్‌ ఉన్నాయి.

నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా నష్టాలు పాలవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనంగా ప్రారంభమైంది. నిన్నటి ట్రేడింగ్‌లో 63.60 వద్ద క్లోజైన రూపాయి విలువ, నేటి ట్రేడింగ్‌ 63.67 వద్ద ప్రారంభమైంది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి వస్తున్న బలహీనమైన సంకేతాలు, రూపాయిని ఒత్తిడికి గురిచేస్తున్నాయని విశ్లేషకులు చెప్పారు. అటు ఆసియన్‌ స్టాక్‌మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా స్టాక్స్‌ కూడా వరుసగా రెండో రోజు నష్టాలు పాలయ్యాయి.

మరిన్ని వార్తలు