లాభాల జోరు

28 Apr, 2020 09:39 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 340 పాయింట్లు ఎగియగా,  నిఫ్టీ 102  పాయింట్లు లాభపడింది.  తద్వారా సెన్సెక్స్ 32 వేల స్థాయిని, నిఫ్టీ 9350 స్థాయిని అధిగమించి స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా  ఆర్బీఐ  అందించిన  లిక్విడిటీ బూస్ట్ తో  మ్యూచువల్ ఫండ్  షేర్లు లాభపడుతున్నాయి.  బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. ఇండస్ ఇండ్, యాక్సిస్, యూపీఎల్, జీ, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్ , గెయిల్, ఐసీఐసీఐ బయాంకు, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్ టెక్ మహీంద్ర, గ్రాసిం, హిందాల్కో లాభపడుతున్నాయి. మరోవైపు వేదాంతా, ఓఎన్జీసీ, హెచ్సీఎల్ టెక్,విప్రో, ఎన్టీపీసీ, రిలయన్స్,బ్రిటానియా నష్టపోతున్నాయి.  జనవరి-మార్చి కాలానికి ప్రైవేటు రంగ బ్యాంకు  ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభంలో 16.18 శాతం క్షీణించి రూ .301.84 కోట్లకు చేరింది. యాక్సిస్ బ్యాంక్ 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను నేడు ప్రకటించనుంది.  మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో 30 శాతం వాటా కొనుగోలుకు యాక్సిస్ బోర్డు ఆమోదం తెలిపినట్టు సమాచారం.  ఈ  డీల్ పై వివరాలను ఈ రోజు ప్రకటించే అవకాశం వుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు