భారీ నష్టాలే...చివరలో స్వల్ప ఊరట

5 Feb, 2018 16:12 IST|Sakshi

 సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలనుంచి  స్వల్పంగా ఉపశమనం పొందాయి.   శుక్రవారం నాటి నష్టాలను  సోమవారం కూడా కొనసాగించిన సూచీలు ఒకదశలో నాలుగువందల పాయింట్లకు పైగా పతనమయ్యాయి.  చివరిగంటలో నెలకొన్న   స్వల్ప కొనుగోళ్లతో   సెన్సెక్స్‌   310పాయింట్ల నష్టంతో  34,757 వద్ద, నిఫ్టీ 94 పాయింట్ల నష్టంతో 10,666 వద్ద ముగిసింది. తద్వారా  నిప్టీ ప్రధాన మద్దతు స్థాయి10700ని  కోల్పోయింది.

మెటల్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, బ్యాంకింగ్‌ సెక్టార్‌ భారీగా నష్టపోయింది. ప్రధానంగా ప్రయవేట్‌ బ్యాంక్స్‌  ఇండస్‌ఇండ్, కోటక్‌మహీంద్ర, , హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ షేర్ల నష్టాలు మార్కెట్‌ దిశను ప్రభావితం చేశాయి. అలాగే మైండ్‌ట్రీ, ఫోర్టిస్‌, అజంతా ఫార్మా, ఎక్సైడ్‌, బాలకృష్ణ, గోద్రెజ్‌ఇండస్ట్రీస్‌, స్టార్‌, ఎన్‌బీసీసీ, అదానీ, ఎల్‌ అండ్‌ టీ  నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.  బోష్‌, కోల్‌ ఇండియా, పవర్‌గ్రిడ్‌ , టెక్‌మహీంద్ర,  టాటా మెటార్స్‌ (ఫలితాలపై అంచనాలతో), భారతి ఎయిర్‌టెల్‌  పీసీ జ్యుయలరీ లాభపడ్డాయి.
 

మరిన్ని వార్తలు