అమ్మకాల సెగ, మార్కెట్ల పతనం

30 Jan, 2020 14:16 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. రెండురోజుల నష్టాలకు నిన్న విరామాన్నిచ్చిన సూచీలు గురువారం  బలహీన పడ్డాయి. సెన్సెక్స్‌  346 పాయింట్లు కోల్పోయి 40846 వద్ద, నిఫ్టీ 113 పాయింట్లు పతనమై 12017 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, ఐటి, ఎనర్జీ, ఫార్మాస్యూటికల్ తోపాటు దాదాపు అన్ని రంగాల షేర్లలోనే అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. అంతర్జాతీయ ప్రతికూలతలకు తోడు ఒకవైపు జనవరి డెరివేటిట్‌ సిరీస్‌ ముగింపు, మరోవైపు రానున్న  కేంద్ర ఆర్థికబడ్జెట్‌ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత మార్కెట్‌ నష్టాలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు కరోనావైరస్ వ్యాధి చైనా అంతటా విస్తరిస్తోందన్నఆందోళన ఆసియా మార్కెట్లనుప్రభావితం చేసింది. ఫిబ్రవరి 1న ప్రభుత్వం బడ్జట్‌ వరకు మార్కెట్లు అస్థిరంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్  ఇన్ఫోసిస్ టాప్‌ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. యస్‌ బ్యాంక్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, సిప్లా, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్‌ సర్వ్‌ కూడా నష్టపోతున్నాయి. అటు ఐషర్ మోటార్స్, పవర్ గ్రిడ్, భారతి ఇన్‌ఫ్రాటెల్, ఎన్‌టీపీసీ, ఐపీఐసీఐ బ్యాంక్ ,  హెచ్‌డీఎఫ్‌సీ లాభపడుతున్నాయి.

మరిన్ని వార్తలు