యుద్ధ ఉద్రిక్తత, తీవ్ర ఒడిదుడుకులు

8 Jan, 2020 10:02 IST|Sakshi

సాక్షి, ముంబై:  ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడి మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక‍్తతలను రాజేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి.  దీంతో ఆసియా స్టాక్‌మార్కెట్లు విలవిల్లాడాయి.  ఫలితంగా ఆరంభంలోనే  దేశీయ స్టాక్‌మార్కెట్‌ 350పాయింట్లు, నిఫ్టీ 100నపాయింట్లకు పైగా కుప్పకూలింది. కానీ వెంటనే  పుంజుకున్నా తిరిగి  నిఫ్టీ 12వేల దిగువకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 98 పాయింట్ల నష‍్టంతో  40770 వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల క్షీణించి 12011 వద్ద కొనసాగుతున్నాయి. తీవ్ర ఊగిసలాట ధోరణి నెలకింది.  బ్యాంకింగ్‌, మెటల్‌, ఆటో, ఎనర్జీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అటు రూపాయి బలహీనత నేపథ్యంతో ఐటీ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. టీసీఎస్‌, అల్ట్రాటెక్‌, టెక్‌ మహీంద్ర, బజాజ్‌ ఆటో, రిలయన్స్‌, ఇండస్‌ఇండ్‌, ఐసీఐసీఐ లాభపడుతుండగా,  బీపీసీఎల్‌, లార్సెన్‌, జీ, ఐషర్‌ మోటార్స్‌, ఎస్‌బీఐ, హిందాల్కో పవర్‌ గ్రిడ్‌, యూపీఎల్‌ నష్టపోతున్నాయి.  

యుద‍్ధవాతావరణం చమురు ధరలకు ఊతమిచ్చింది. ఇరాక్‌లోని అమెరికా రెండు ఎయిర్‌బేస్‌లపై  బాలిస్టిక్ క్షిపణి దాడి అనంతరం బుదవారం ఉదయం చమురు ధర 4.5 శాతం  ఎగిసింది. డబ్ల్యుటిఐ 4.53 శాతం పెరిగిబ్యారెల్ 65.54 డాలర్లకు చేరుకుంది.  బ్రెంట్‌ క్రూడ్‌ 70 డాలర్లును తాకినా,ప్రస్తుతం 69.29వద్ద వుంది.  దీంతో మంగళవారం కొద్దిగా శాంతించిన పుత్తడి ధరలో నేడు మరోసారి పుంజుకున్నాయి. ఏడేళ్ల గరిష్టాన్ని తాకాయి.  

మరిన్ని వార్తలు